ఉగాది పచ్చడి

ఉగాది రోజున ఇంట్లో పెద్దవాళ్లు ఉగాది పచ్చడి తిని ఇంటిల్లపాదికీ తినిపించడం పరిపాటే. ఇది చేదుగా వున్నట్టు బ్రమతో పిల్లలు మారాము  చేస్తుంటారు. నిజానికి ఉగాది పచ్చడి చేదుగా ఉండదు. అది ఆరు రుచుల కలయిక. ఈ ఆరు రుచుల కలయికలో ఎంతో లోతైన అర్ధముంది. ప్రకృతి లేనిదిే మనిషి లేడు. మనిషి లేనిదే ప్రకృతి ఉన్నప్పటికీ అది అసంపూర్ణం. కాబట్టి ప్రకృతి సిద్ధమైన, ప్రకృతి నుంచి లభించే ఆరు రుచులతో కూడిన పచ్చడిని తినిపించడం ద్వారా మానవునికి, ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది. ఈ పండుగ తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్యే ఉగాది పచ్చడి తినడంలోని ఉద్దేశ్యం సంప్రదాయాన్ని గౌరవించడం ఒక్కటే కాదు, ఎన్నో ఆరోగ్యసూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయి. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు. బాధలు, సంతోషాలు, కోపతాపాలు, రోషావేశాలు, ప్రేమాదరాలు వంటి వివిధ రకాలైన అనుభవాలూ, అనుభూతులూ కూడా ఉంటాయని, అలా ఉండటమే పరిపూర్ణమైన జీవితమన్న సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి.

ఉగాది పచ్చడిని వేపపువ్వు, మామిడి ముక్కలు, కొత్త చింతపండు, బెల్లం, అరటిపండు, కారం, ఉప్పు కలిపి తయారుచేస్తారు.

ఒండ్ర మట్టితో ప్రతిమలు

 పూజా సామగ్రని ప్రతిమలను ఒండ్రుమట్టితో చేసినవి శ్రేష్టము అంటారు. అదేమంటే ఒండ్రమట్టి సాధారణముగా జలాశయములలోనే ఉంటుంది. కాబట్టి పండుగ సంధర్బాలలో దేవతా ప్రతిమల తయారీలలో ఒండ్రమట్టి వాడకము వలన ఆయా ప్రాంత జలాశయాలు పూడికతో నిండి వున్న వాటిని పూడిక  తీసినట్లవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీగాక మట్టిని తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసినదే.                     

 గుడిలో  ఘంట

  • గుడి ఉన్న ప్రాంతాన్ని తెలుసుకొనుటకు
  • దేవతలు యోగనిద్రలో ఉంటారు కాబట్టి మేము వచ్చామని భగవంతునికి తెలియచేయడం కోసం
  • ఘంట నుంచి వెలువడే ధ్వనికి రాక్షసులతో సహా దుష్టశక్తులు పారిపోతాయనే ఉద్దేశంతో ఆలయంలోకి అడుగిడగానే భక్తులు ముమ్మారు ఘంటను మోగిస్తారు.
  • ఘంటానాదానికి ప్రతిధ్వనించే లక్షణం ఉంది. ఆ శబ్దతరంగాలు గుండ్రంగా తిరుగుతూ మానవుని మస్తిష్కానికి చేరి మెదడును చైతన్యపరుస్తుంది.
  • లయ బద్ధమైన ఘంటానాదం వల్ల కంటికి కనిపించకుండా గాలిలో దాగి ఉండే రకరకాల వ్యాధికారక సూక్ష్మక్రిములు నశిస్తాయని శాస్త్రం చెబుతుంది.

పూజించిన వాటిని నీటిలో నిమజ్జనం

                   కొన్ని రోజులపాటు పూజలు చేసిన దైవ విగ్రహాలను మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది.

                పాంచభౌతికమైన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్ధమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలసిపోవలసిందే. 

                    అందుకే ప్రకృతి దేవతా మూర్తుల ప్రతిమలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు. 

Make a Free Website with Yola.