సంజ్ఞల భాష

ఆబె ఛార్లెస్ మైకెల్ అపీ 

జిరోనిమో కార్డనో 

         చెవిటి, మూగ వారి కోసం 18వ శతాబ్దంలో ఫ్రాన్స్‌కు చెందిన ఆబె ఛార్లెస్ మైకెల్ అపీ సంజ్ఞలతో కూడిన ఒక భాషను తయారుచేశాడు. చేతులతోనూ, వేళ్ళతోను వివిధ రకాలుగా సంజ్ఞలు చేయడమే ఈ పద్ధతి.

    అంతకు ముందు ఇటలీ దేశానికి చెందిన జిరోనిమో కార్డనో అనే వైద్యుడు మూగ, చెవిటి వారికి రాత ద్వారా విద్యాబోధన చేయడానికి ఒక విద్యావిధానాన్ని కనుగొన్నాడు.

                                   ఎనిమిది, తొమ్మిది దశాబ్దాల కిందటి వరకూ మూగ, చెవిటి వారు సంజ్ఞల ద్వారా, ముఖంలో భావ వ్యక్తీకరణ ద్వారా సంభాషించుకునే పద్ధతి వుండేది. వీళ్లు నిముషానికి వందకు పైగా పదాలను వ్యక్తీకరించగలిగేవారు. ఆ తర్వాత జర్మన్ దేశస్థుడైన మోరిజ్ హిల్ సంజ్ఞలతో గాక పెదవుల కదలికతో మూగ, చెవిటి వారు సంభాషించే విధానాన్ని కనిపెట్టాడు. అయితే ఇది అంత సంతృప్తికరంగా లేకపోవడంతో చేతివేళ్ల సంజ్ఞలు, పెదవుల కదలిక రెండిటినీ కలిపి సంభాషించడం ప్రారంభించారు. ఇప్పుడు వారికోసం ప్రత్యేకంగా వార్తలు కూడా ప్రసారమవుతున్నాయి.

గురజాడ అప్పారావు

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తి గురజాడ అప్పారావు. రాశిలో తక్కువైనా గురజాడ రచనలు వాసికెక్కాయి. వ్యావహారిక బాషలో రచనలు చేయటం తప్పుగా, చేతకానితనంగా భావించే రోజుల్లో ఆయన ప్రజలందరికి అర్ధమయ్యే రీతిలో వ్యవహారికబాషలో రచనలు చేశారు. గురజాడ వారి కుటుంబం, వారి తాతలకాలంలో కృష్ణాజిల్లా గురజాడ గ్రామం నుంచి విశాఖపట్నం ప్రాంతానికి వలస వచ్చింది. యలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్ 21న గురజాడ అప్పారావు జన్మించాడు. తండ్రి వెంకటరామదాసు, తల్లి కౌసల్యమ్మ. పదేళ్లు వచ్చేవరకు చీపురుపల్లిలోనే చదువుకున్నాడు. 1884 లో మహారాజా కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేరాడు గురజాడ. 1885లో అప్పలనరసమ్మతో వివాహం అయ్యింది. వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులుతో జరిగిన పరిచయం గురజాడ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకాన్ని 1892లో మొదటసారి ప్రదర్శించారు. ఆ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు పాత్రలు ప్రపంచ ప్రఖ్యాతిపొందాయి. 


పంచతంత్రం

        విష్ణుశర్మ అనే మహా పండితుడు కొందరు

 రాజకుమారులకు చెప్పిన నీతికథలే సంస్కృతంలో

 పంచతంత్రంగా ప్రసిద్ధి చెందాయి. పంచతంత్రంలో వుండే ఐదు

 తంత్రాలు – మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి, 

అసంప్రేక్ష్యకారిత్వం. దీన్ని పరవస్తు చిన్నయసూరి తెలుగులో

 రాశారు. పంచతంత్రం అనేక భారతీయ భాషలలోకి 

అనువదింపబడింది. పంచతంత్రం ఖ్యాతి దేశాంతరాలు దాటి

 ఖండాంతరాల వరకు వ్యాపించింది. పక్షులు, జంతువులే

 పాత్రధారులుగా సాగే పంచతంత్రంలోని నీతికథలకు 

సాటిరాగల కథలు శతాబ్దాలుగా రాలేదని ప్రతీతి.

       17వ శతాబ్దంలో ఫోంటస్ అనే ఒక ఫ్రెంచి రచయిత 

పంచతంత్రాన్ని ఫ్రెంచి భాషలోకి అనువదించాడు. తర్వాత సర్

 ఎడ్వర్డ్ మార్షల్ దీన్ని ఫ్రెంచి నుండి ఆంగ్లబాషలోకి 

అనువదించాడు. ప్రపంచంలో బాలకథా సాహిత్యంలో

 పంచతంత్రానిదే పై చెయ్యి అని ప్రఖ్యాతి రచయిత ఆర్థర్ రైడర్

 అన్నాడు. ఈసప్ కథలు కూడా పంచతంత్రం కథలకు 

అనుకరణే అంటారు. 

                           

                                కవి సామ్రాట్

             విశ్వనాధ సత్యనారాయణ

                      కవిసామ్రాట్ బిరుదాంకితుడు, తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ కృష్ణాజిల్లావాసీ. ఈ మహనీయుడు జన్మించింది ఉంగుటూరు మండలం నందమూరు గ్రామంలో. 20వ శతాబ్దంలోనే ఆంధ్ర సాహిత్యానికి పెద్ద దిక్కయ్యారు. విశ్వనాధ సత్యనారాయణ చేపట్టిన సాహిత్య పక్రియ, రచించిన రచనలు మనందరికి స్పూర్తిదాయకం. 1916లో విశ్వేశ్వర శతకంతో విశ్వనాధ రచనా ప్రస్థానం మొదలైంది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆ సమయంలోనే "ఆంధ్రపౌరుషము" రచించారు. 1920 నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. విశ్వనాధం 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంధాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు రచించారు.

     


                కాళోజీ

** జననం 9 సెప్టెంబర్ 1914

** తల్లిదండ్రులు కాళోజీ రంగారావు (మహారాష్ట్ర), రామాబాయి (కర్ణాటక)

** భార్య రుక్మిణీబాయి (వివాహం, 1940)

** కొడుకు రవికుమార్

** కాళోజీ కవితల సంకలనం నా గొడవ

** ఇదీ నా గొడవపేరుతో ఆత్మకథ రాశాడు.

** ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుడు.

** ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు.

** శాసనమండలి సభ్యుడు(1958-60)

** 1992లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నాడు.

** మరణం 13 నవంబర్ 2002 

ఎటు చదివినా ఒకటే 

    కనుక                                 జలజ

    పులుపు                             రంగనగరం

    కిటికి                                 నందనందనం

    మిసిమి                              సంతసం

    గంగ                                  మందారదామం

    వికటకవి                             సరస

    ఇటు చదివితే ఒకటి       --        అటు చదివితే ఒకటి

          కడప                      --                పడక

          కలప                      --                పలక

          డంక                       --                కండ

          పడగ                      --                గడప

           లత                       --                 తల  

Make a Free Website with Yola.