టియర్ గ్యాస్ (బాష్ప వాయువు)

టియర్ గ్యాస్‌ను లాక్రిమేటరీ ఏజెంట్ లేదా లాక్రిమేటర్ అంటారు. లాటిన్‌లో లాక్రిమేట్ అంటే కన్నీరు అని అర్ధం. ఇది గుంపును లేదా సమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లేదా మిలిటరీ అధికారులు ఉపయోగించే ఒక విధమైన రసాయన ఆయుధం. ఇది క్యాన్లలో లేదా  చిన్న సిలిండర్లలో భద్రపరచి ఉంటుంది. దీనిని ప్రయోగించినప్పుడు ఒక విధమైన తెల్లని పొగలతో కూడిన వాయువు విడుదలవుతుంది. ఘాటైన ఆ వాయువు కళ్లు, ముక్కు, నోరు, ఊపిరితిత్తులలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ అనే ఒక సున్నితమైన పొరను ప్రేరేపించి, దురద, మంట పుట్టేలా చేస్తుంది. దీని ప్రభావంతో కళ్లు మండుతాయి. తీవ్రమైన తుమ్ములతో, దగ్గుతో, కన్నీటితో మనుషులు ఉక్కిరిబిక్కిరి అవుతారు. దీని ప్రభావం 20 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు ఉంటుంది. దీని ప్రభావం నుంచి పూర్తిగా బయట పడాలంటే కనీసం అరగంట పడుతుంది. దీనిని ప్రయోగించేవారు మాత్రం ముక్కుకు, నోటికి మాస్కు ధరిస్తారు. లేదంటే వారిపైన కూడా దీని ప్రభావం పడుతుంది.  

ఉల్లిపాయలు తరిగితే కన్నీళ్ళెందుకు

ఇంట్లో ఎవరైనా ఉల్లిపాయలు తరుగుతుంటే వాళ్లు ఏడుస్తున్నట్లుగా కంటి నుంచి నీరు కారుతుంది. ఉల్లిపాయులను ఎవరు తరిగినా కంటి నుండి నీరు కారడం సహజం. దీనికి కారణం ఉల్లిపాయలలో కళ్ళను మండించే ఒక పదార్ధం ఉంది. దాని పేరు ప్రోఫిన్ సల్ఫినిన్.

ఉల్లిపాయలను కోయగానే దానిలో ఉన్న ఈ పదార్ధం గాలిలో కలుస్తుంది. ఆ గాలి మన కంటికి తగలగానే కళ్లు మండుతాయి. వెంటనే మన కళ్ళ నుంచి నీరు కారుతుంది. కొంచెం ఇబ్బంది అనిపించినా, అప్పుడప్పుడు ఇలా కళ్ళలో నుంచి నీరు కారడం మంచిదే. ఎందుకంటే గాలిలో నుంచి మన కంటిలోకి చేరిన ధూళి కణాలు కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తాయి.   

మరిగించిన నీరు చప్పగా ఉంటుంది

శుభ్రమైన, ఆరోగ్యకరమైన నీటికి ఒక విధమైన రుచి ఉంటుంది. అటువంటి నీరు తాగినప్పుడు నాలుకకు హాయిగా ఉంటుంది. ఇటువంటి నీరు ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఈ నీటిలో ఖనిజ లవణాలు ఉంటాయి.

అయితే తాగే నీటిని మరిగించినప్పుడు రుచి కోల్పోయి చప్పగా తయారవుతాయి.

మంచినీటిలో అనేక రకాల వాయువులు, ఖనిజాలు కలిగి ఉంటాయి. నీటిలో కరిగివున్న వాయువులు నీటిని వేడిచేసినప్పుడు ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోతాయి.ద్రవరూపంలో కరిగియున్న బైకార్బోనేట్లుగా విడిపోయి, కరగని కార్బోనేట్లుగా మారిపోతాయి. ఈ కార్బోనేట్లు నీళ్లు మరిగించిన పాత్ర అడుగు భాగంలో పక్క భాగాలకు పొరలాగా ఏర్పడుతాయి. దీర్ఘకాలం నీటిని మరిగించే పాత్రలలో ఇటువంటి పొరలను చూడవచ్చు.

మరిగించినప్పుడు వాయువులను, ఖనిజాలను కోల్పోవడం వల్ల నీళ్లు చప్పగా అవుతాయి.

రసాయనాలను గాజుపాత్రలోనే ఉంచాలి

సాధారణంగా కొన్నిరకాల మందులు, టానిక్కులు, రసాయనాలను గాజుసీసాల్లోనే ఉంచటం గమనిస్తాము. రసాయనాలను అలా గాజు సీసాల్లోనే ఉంచేందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి .... గాజు రసాయనికంగా స్థిరమైనది. ఇది దేనితోనూ చర్య జరపలేదు. ఆమ్లాలు, క్షారాలు, విషాలు, నూనెలు, సేంద్రియ పదార్ధాలు ఏవి గాజుతో చర్య చెందవు. రెండవ విషయం .... గాజు పారదర్శకంగా ఉంటుంది. అందువల్ల లోపల ఏముందో, అది ఏ స్థితిలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాంతి సమక్షంలో చర్యలకు లోనయ్యే కొన్ని రసాయనాలను సచ్ఛిద్రమైన అంటే ముదురు గోధుమ రంగులో ఉండి, లోపల ఏముందో బయటికి కనిపించని విధంగా ఉండే గాజుపాత్రలలో ఉంచుతారు. ఉదాహరణకు హైడ్రోజన్ పెరాక్సైడ్, అసిటోన్, బెంజిన్ వంటి ద్రవాలను గోధుమరంగు పారదర్శక గాజు పాత్రల్లో నిల్వ ఉంచుతారు. ఎలాంటి గాజు సీసాల్లోనూ నిల్వ చేయలేని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం ను గాజు పాత్రలలో ఉంచకూడదు. గాజులోని సిలికేట్లతో అది రసాయనికచర్య జరపడమే అందుకు కారణం. చటుక్కున మండే దహనశీలత ఉన్న పదార్థాలను కూడా గాజు పాత్రల్లో ఉంచరు. పొరపాటున పగిలితే ప్రమాదం గనుక. 

 పెట్రోలియం

పెట్రోలియం భూమి రాతిపొరల మధ్యలో ఉంటుంది. కాబట్టే దీన్ని రాతినూనె అని కూడా అంటారు.

అనేక కోట్లసంవత్సరాల కిందట ఇప్పుటి భూబాగాలు చాలావరకు సముద్రగర్భంలో మునిగి వుండేది. సూర్యరశ్మి ఆ నీటి మీద విస్తారంగా పడి అనేక జలజీవులుపుట్టి, పెరిగి పెంపొందాయి. చిన్న చిన్న వృక్ష, జంతుజాతి జీవాలు సూర్యతేజశ్శక్తిని తమ శరీరపు అణుమాలికలతో బంధించి వుంచాయి. క్రమంగా ఆ జీవులు చనిపోయి నీటి అడుగుకు చేరుకున్నాయి. అలాంటి జీవజాలపు శరీర అవశేషాలతో సముద్రపు నేలమీద మందమైన పొరలా ఏర్పడింది. ఆ పొర మీద క్రమంగా లక్షలాది టన్నుల ఇసుక, బురద పడి మూసివేశాయి. పైపొరల బరువుకు ఆ ఇసుక, బురద కలిసి నొక్కుకుని రాయిలా రూపొందాయి. ఈ ఇసుక రాతిపొరల మధ్య చిక్కుపడిన కోట్లాది జీవుల అవశేషాలు సూక్ష్మజీవుల ప్రభావం వల్ల పెట్రోలియంగా, సహజవాయువుగా మారి రాతిపొరల మధ్య కోట్లాది సంవత్సరాలుగా దాగి వున్నాయి.

 

లార్డ్ జోసెఫ్ లిస్టర్

శస్త్రచికిత్స విధానంలో కార్బాలిక్ అసిడ్‌ను వినియోగంలోకి తెచ్చి, శస్త్ర చిత్సలకు పరిశుభ్రమైన పద్దతులను రూపొందించిన శాస్త్రవేత్త లార్డ్ జోసెఫ్ లిస్టర్.

లిస్టర్ 1827 ఏప్రిల్ 5న ఇంగ్లండ్‌లో జన్మించాడు. లండన్‌లో వైద్యవిద్యను అభ్యసించి 1853లో ఎడిన్‌బర్గ్‌లో ప్రముఖ వైద్యుడు జేమ్స్ సైమ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. అప్పట్లో శస్త్రచికిత్స విధానాలు మొరటుగా, అనారోగ్యకరంగా వుండేవి. దీంతో చాలా మంది రోగులు ఇన్ఫెక్షన్లతో చనిపోతుండేవాళ్లు.

అటువంటి పరిస్థుతులలో కార్బాలిక్ ఆసిడ్‌కు సూక్ష్మజీవులను సంహరించే లక్షణం వున్నదని గమనించిన లిస్టర్ ఒక రోగి గాయాన్ని కార్బాలిక్ ఆసిడ్‌లో ముంచిన గుడ్డతో కప్పి దానిపైన మరొక గుడ్డవేసి కట్టుకట్టాడు. దాంతో సూక్షజీవులు నశించడాన్ని గమనించాడు. శస్త్రచికిత్స పరికరాలను కార్బాలిక్ ఆసిడ్‌తో శుభ్రం చేసి, ఆవిరిమీద మరగ బెట్టడం ద్వారా లిస్టర్ రోగుల ఇన్‌ఫెక్షన్ మరణాలను గణనీయంగా తగ్గించగలిగాడు. దీంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు లభించాయి. ఆయన 1912 ఫిబ్రవరి 12న కన్నుమూశాడు.

సర్ హంఫ్రీ డేవీ

(17-12-1778 ---- 29-5-1829)

లాఫింగ్ గ్యాస్

ఇంగ్లాండ్‌లోని పెంజెన్స్ ప్రాంతంలో 1778 డిసెంబర్ 17న జన్మించిన సర్ హంఫ్రిడేవి అనే శాస్త్రవేత్త లాఫింగ్ గ్యాస్‌ను కనుగొన్నాడు.

                   డేవీ రసాయన శాస్త్రం పట్ల మక్కువతో 1797లో లెవాయిజర్ రాసిన పుస్తకం చదివి రసాయన శాస్త్రజ్ఞుడుగా మారాలనుకున్నాడు. కెమిస్ట్‌గా మారిన తర్వాత డేవి చికిత్సకు పనికివచ్చే వాయువుల గుణాలు కనిపెట్టే సంస్ధలో చేరాడు. అక్కడ ఆయన నైట్రస్ ఆక్సైడ్ ను కనిపెట్టాడు. నైట్రస్ ఆక్సైడ్‌నే లాఫింగ్ గ్యాస్ అంటారు.

                     1801లో లండన్‌లోని రాయల్ ఇన్‌స్టిట్యూషన్ అనే సంస్ధలో ఉపన్యాసకుడుగా డేవీ చేరాడు. ఆ సంస్ధలో ఓల్టాబ్యాటరీ అనే పెద్ద పరికరం ఒకటి వుండేది. అక్కడ ప్రయోగాలు చేస్తూ నీటిలో విద్యుత్ విశ్లే,ణం ద్వారా ఆక్సిజన్ వాయువు, దానికి రెట్టింపుగా హైడ్రోజన్ వాయువు వెలువడటాన్ని డేవీ కనుగొన్నాడు. డేవీ 1807 అక్టోబర్ 6న అంతవరకూ శాస్త్రవేత్తలకు లొంగని పొటాషియం ధాతువును ఎలక్ట్రాలసిస్ ద్వారా విడదీశాడు.

                     అన్నిటికంటే ముఖ్యంగా సర్ హంఫ్రీ డేవీ 1815లో గనులలో ఉపయోగించే సురక్షితమైన ల్యాంప్‌ను కనుగొన్నాడు. దీన్ని డేవీస్ సేఫ్టీ ల్యాంప్ అంటారు. దీన్ని కనుగొనడం ద్వారా గనికార్మికులకు ఆయన మహోపకారం చేశాడు. 1829 మే 29న స్విట్జర్లాండ్‌లో ఆయన మరణించాడు.   

 

అణువును విభజించడం వల్ల శక్తి పుడుతుంది. ఈ అణువిభజనను కనుగొన్న శాస్త్రవేత్తలలో ఒకడు ఆటోహన్.

1879 మార్చి 8న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జన్మించిన ఆటోహన్ మ్యూనిచ్, రసాయన శాస్త్రం అభ్యసించాడు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో రీసెర్చ్ చేసిన తర్వాత 1904లో లండన్‌లో పరిశోధనలు చేశాడు. 1906లో బెర్లిన్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పరిశోధనలు కొనసాగించాడు. 

1904లో రేడియో థోరియం ను, 1907లో మెసోథోరియం ను కనుగొన్నాడు. న్యూట్రానులలో యురేనియం కేంద్రకాలను బద్దలు కొట్టి పరిశోధనలు చేశాడు. స్ట్రస్‌మన్ అనే మరో శాస్త్రవేత్తతో కలిసి ఆటోహన్ 1939లో న్యూట్రానులను ఆవిష్కరించాడు. 1944లో రసాయన శాస్త్రంలో ఆటోహన్‌కు నోబెల్ బహుమతి లభించింది. కొత్తగా కనుగొన్న 108వ మూలకానికి హహ్నియం అని పేరు పెట్టారు.



ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్

               ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ 1833 అక్టోబర్ 21న 

స్టాక్‌హోమ్‌లో జన్మించాడు. 1896 డిసెంబర్ 10న 

కన్నుమూశాడు. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ 1867లో డైనమైట్

 అనే పేలుడు పదార్ధాన్ని కనిపెట్టాడు. దీనిలోని ముఖ్దీయమైన

 పేలుడు పదార్న్నిధం నైట్రో గ్లిజరిన్. నైట్రో గ్లిజరిన్‌ను 

క్షేమకరంగా ఉపయోగించటానికి దానిని కీసెల్ ఘర్ అనే 

తేలికగా ఉండే బీడిద వంటి మట్టి కలిపి ప్రయోగించాడు నోబెల్.

  కొండలు పగలగొట్టడానికి, భూగర్భంలో అన్వేషణలకు, 

పెట్రోల్ బావులు తవ్వడానికి, యుద్ధాలలోనూ ఉపయోగిస్తారు.

             డైనమైట్ కనిపెట్టడం ద్వారా నోబెల్ ప్రపంచప్రఖ్యాతి 

పొందాడు. విపరీతంగా డబ్బు గడించాడు. చనిపోయేనాటికి 

ఆయనకు 9,20,000 డాలర్ల ఆస్తి వుండేది.

           ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ వీలునామాలో తన ఆస్తిపై 

వచ్చే వడ్డీతో అయిదు రంగాలలో విశేష కృషి చేసినవారికి తన

 పేరు మీద ప్రతి ఏటా బహుమతులు ఇవ్వాలని రాశాడు.

            భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యం, 

          శాంతి రంగాలలో నోబెల్ బహుమతులు ఇస్తారు. ఈ 

             బహుమతి ప్రపంచంలోకెల్లా ప్రాధాన్యంగల ఒక 

                    అత్యున్నతమైనదిగా భావిస్తారు. ఒక్కో నోబెల్ 

పురస్కారం విలువ సుమారు 3 లక్షల 50 వేల అమెరికన్ 

డాలర్లు (సుమారు 1 కోటి 75 లక్షల రూపాయలు). ఈ 

బహుమతి స్టాక్‌హోమ్‌లో అందజేస్తారు. నోబెల్ వివాహం 

చేసుకోలేదు. ఆయన మరణించేనాటికి 90 కంపెనీలకు 

వ్యవస్థాపక భాగస్వామి, 355 పేటెంట్లకు హక్కుదారుడు.

 బోఫోర్స్ కంపెనీ ఇతను స్థాపించిందే. మొదట్లో ఇనుము 

కర్మాగారంగా ప్రారంభించి, తర్వాత ఆయుధాల ఫ్యాక్టరీగా 

మార్చాడు. ఇప్పటికీ ఆ కంపెనీ ఆయుధాలు, విమానాలను 

ఉత్పత్తి చేస్తూనే ఉంది. 

Make a Free Website with Yola.