బీర్బల్ సాహ్ని

వృక్ష శిలాజాల గురించి ఎన్నో పరిశోధనలు చేసిన పురావృక్షశాస్త్రం (పాలియో బోటనీ) నిష్ణాతుడు, శాస్త్రవేత్త బీర్బల్ సాహ్ని.

1891 నవంబర్ 14న మనదేశంలో పశ్చిమ పంజాబ్‌లోని భేరా ప్రాంతంలో జన్మించిన సాహ్ని 1911లో పంజాబ్ యూనివర్సిటీలో సైన్స్‌లో డాక్టరేట్ పొందాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, పంజాబ్ యూనివర్సిటీ, లక్నో యూనివర్సిటీలలో అధ్యాపకునిగా పనిచేశాడు.

పూర్వకాలంలో నశించిపోయిన జంతు జాతులలాగానే అనేక వృక్షజాతులు కూడా వున్నాయి. వీటి శిలాజాల ఆధారంగా బీర్బల్ సాహ్ని నిరంతర పరిశోధనలు సాగించాడు. గోండ్వానా వృక్షాల గురించి, బీహార్‌లోని పర్వత ప్రాంతాలలో జురాసిక్ కాలం నాటి వృక్ష అవశేషాలను గురించి ఆయన చేసిన పరిశోధనలు ప్రసిద్ధిచెందాయి. 1936లో ఆయన రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1949 ఏప్రిల్ 10న కన్ను మూశాడు. ఆయన పేరిట లక్నోలో బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ నెలకొల్పబడింది.

http://www.bsip.res.in/

వరాహమిహిరుడు

జ్యోతిషశాస్త్రంలో అనేక మంచి గ్రంధాలను రచించాడు వరాహమిహిరుడు. ఉజ్జయిని ప్రాంతానికి చెందినవాడు.

              భవిష్యత్తును, మంచిచెడులను చెప్పేశాస్త్రం జ్యోతిషశాస్త్రం. పూర్వం దీనినే రాశి, దైవ, నక్షత్ర విద్య అని పేర్కొనేవారు. జ్యోతిషశాస్త్రంలో సిద్ధాంత, జాతక, సంహిత స్కందాలనే మూడు భాగాలను గురించి వరాహమిహిరుడు గ్రంధాలు రాశాడు.

               వరాహమిహిరుని తండ్రి ఆదిత్యదాసుడు గొప్ప పండితుడు. వరాహమిహిరుడు తండ్రివద్దనే సకల విద్యలు నేర్చుకున్నాడు. ఉజ్జయినీ రాజుల ప్రశంసలు పొందాడు.

                లఘుజాతకం, బృహత్ జాతకం, వివాహపటలం, బృహత్ సంహిత, యోగ యాత్ర, పంచ సిద్ధాంతిక అనేవి వరాహమిహిరుడు రాసిన గ్రంధాలు. ఇవి మూఢనమ్మకాలను కూర్చినవిగా గానీ, మూఢనమ్మకాలను ప్రోత్సహించేవిగా గానీ భావించరాదు.

                 పంచసిద్ధాంతికలో వరాహమిహిరుడు భూగోళానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు. పంచభూత సహితమైన భూగోళం గోళాకారంలో ఉంది. రెండు అయస్కాంతాల మధ్య లోహం ఉన్నట్లు ఏ ఆధారం లేకుండానే అది నిలిచి ఉందని ఆయన పేర్కొన్నాడు. ఈయన క్రీ.శ.505లో జన్మించి క్రీ.శ.587లో మరణించాడు. 

సర్ సి.వి.రామన్

      భారత దేశానికి చెందిన గొప్ప శాస్త్రజ్ఞులలో సి.వి.రామన్ ఒకరు. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర వెంకటరామన్. ఈయన తిరుచిరాపల్లి 1888 నవంబరు 7 న జన్మించారు. చిన్నతనం నుండి చదువులో అత్యంత ప్రతిభ కనబరచిన రామన్ 1907లో సివిల్ సర్వీస్‌లో ఉత్తీర్ణుడై కలకత్తా డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా నియమితులయ్యారు. 1917లో ఉద్యోగానికి రాజినామా చేసి, కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరారు. 1921లో యూరప్ వెళ్లడానికి సముద్ర ప్రయాణం చేస్తండగా మధ్యధరా సముద్రం నీలిరంగును చూసి ఆశ్చర్యపోయారు. గ్లాసియర్ల రంగు కూడా నీలంగా వుండటం గమనించారు. తర్వాత సూర్యరశ్మని నీరు, పారదర్శకమైన మంచు, ఇతర పదార్ధాలలోకి ప్రసరింపజేసి ప్రయోగాలు జరిపారు. సముద్రం నీలరంగులో ఉండటానికి గల కారణాన్ని వివరించి చెప్పారు. ఈ రంగంలో పరిశోధన సాగిస్తూనే 1928లో రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నారు.

                  మెర్క్యరీ ఆర్క నుండి ఒకే వర్ణపు ప్రకాశం (మోనో క్రొమాటిక్ లైట్) స్పక్ట్రో స్కోప్‌ను ఈ అధ్యయనం కోసం ఉపయోగించారు. అనేక పదార్ధలగుండా కాంతిని పంపి స్పెక్ట్రమ్‌లో కొన్ని కొత్తలైన్లను గుర్తించారు. దీన్నే రామన్ ఎఫక్ట్ అంటారు. దీనివల్లనే ఆయన 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.  

శాంతిస్వరూప్ భట్నాగర్

                  శాంతిస్వరూప్ భట్నాగర్ 1894 ఫిబ్రవరి 21న పశ్చిమ పంజాబ్‌లోని భేరా అనే ప్రాంతంలో జన్మించారు.1921-24 వరకు ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం రసాయనిక శాస్త్రంలో ప్రొఫెసర్‌‌‌గా, 1924-30లో లాహోర్‌లోని యూనివర్శిటీ కెమికల్ లేబొరేటరీస్‌కు డైరక్టర్‌గా పనిచేశారు.

                    భట్నాగర్ భౌతిక రసాయన శాస్త్రంలో, ముఖ్యంగా రసాయన అధ్యయనంలో విశిష్ట కృషి చేశారు. 1943లో లండన్‌లోని రాయల్ సొసైటీలో మెంబర్ అయ్యాడు. మన దేశంలో అనేక జాతీయ పరిశోధన ప్రయోగశాలను ఏర్పాటుచేశాడు. 1955 జనవరి ఒకటిన కన్నుమూశారు.

                శాంతి స్వరూప్ భట్నాగర్ 1942 - 54 వరకు కౌన్సిల్ ఆప్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌ సంస్థ మొదటి డైరక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఆయన గౌరవార్ధం ఆయన పేరిట కౌన్సిల్ ఆప్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌వారు  ప్రతి ఏట ఉత్తమ శాస్త్ర పరిశోధకులకు అవార్డు శాంతిస్వరూప్ భట్నాగర్ మెమోరియల్ అవార్డును ప్రధానం చేస్తారు.

                                      హోమి జహంగీర్ భాభా

(30.10.1909 - 24.1.1966)

                   భారతదేశంలో అణుశక్తి కార్యక్రమాన్ని 1948లో మొట్టమొదట ప్రారంభించిన శాస్త్రవేత్త హోమిజహంగీర్ భాభా.

            భాభా ఆటామిక్ ఎనర్జీ కమిషన్ ఈయన పేరిటనే ప్రసిద్ది చెందింది. భారతదేశపు అటామిక్ ఎనర్జీ (అణుశక్తి) కమిషన్‌కు ఈయన మొదటి చైర్మన్. 1909లో అక్టోబర్ 30 న జన్మించిన భాభా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వున్నప్పుడు 'నీల్స్ భోర్' అనే శాస్త్రవేత్తలతో కలసి క్వాంటమ్ ధియరీ మీద వాల్టర్ హిట్లర్ అనే శాస్త్రవేత్తతో కలసి కాస్మిక్ కిరణాల మీద పరిశోధనలు చేశారు. 1940లో భారతదేశానికి తిరిగి వచ్చి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 1945లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ని నెలకొల్పి, డైరెక్టర్ అయ్యారు. ఈయన నేతృత్వంలో భారత శాస్త్రజ్ఞులు అణుశక్తిని ఉత్పత్తి చేయడంలో పరిశోధనలు చేశారు 

             1955 లో జెనీవాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన 'అణుశక్తి - శాంతి' ప్రయోజనాలు అనే సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. భారతదేశపు అణుశక్తి కార్యక్రమాల నిర్మాతగా ఆయన చిరస్మరనీయుడు

 

Make a Free Website with Yola.